పటాన్చెరు, జూలై 30
లయన్స్ క్లబ్స్ అంతర్జాతీయ చైర్మన్ లయన్ ఘట్టమనేని బాబురావు జన్మదినాన్ని పురస్కరించుకొని, శేరిలింగంపల్లి రీజియన్ లోని 10 లయన్స్ క్లబ్ లు పలు అనాధ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించాయి. ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 400 మంది అనాధలకు భోజనం అందించారు.
లయన్స్ క్లబ్స్ అంతర్జాతీయ చైర్మన్ లయన్ ఘట్టమనేని బాబురావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, శేరిలింగంపల్లి రీజియన్ లోని 10 లయన్స్ క్లబ్ లు వివిధ కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రోగ్రామ్మింగ్ చైర్మన్ లయన్ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరు లయన్స్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ క్లబ్ పట్నం సురేందర్, మంజీరా క్లబ్ శ్రీ లక్ష్మారెడ్డి, శేరిలింగంపల్లి క్లబ్ జనార్దన్ రెడ్డి, భీమా క్లబ్ అప్పారావు, ప్రాణహిత క్లబ్ శ్రీనివాస్ రెడ్డి, సంగారెడ్డి క్లబ్ ఏ.లక్ష్మారెడ్డి, జూబిలీ హిల్స్ క్లబ్ కరుణ కుసుమ్బ, శక్తి క్లబ్ కవిత, మానవతా క్లబ్ ఇ.వి.రమణ ఆధ్వర్యంలో పలు అనాధ ఆశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.
రామేశ్వరం బండలోని మదర్ మేరీ, అమీన్ పూర్ లోని ప్రతిమ మినిస్ట్రీస్, మియాపూర్ లోని వివేకానంద ఓల్డ్ ఏజ్, గౌతంచెరువు, సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రి, నాదరుగుల్ లోని మాతృ దేవోభవ అనాద ఆశ్రమం, బాచుపల్లిలోని మీనాక్షి ఓల్డ్ ఏజ్, చందానగర్ లోని అమ్మా, నాన్న అనాధ ఆశ్రమాలలో ఈ అన్నదాన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల ద్వారా సుమారు 400 మంది అనాధలకు భోజనం అందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఎండీఆర్ ఫౌండేషన్ లయన్ జైపాల్, మంగళపర్తి వెంకటేశం, జి.శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, పి.అశోక్ గౌడ్, కరుణాకర్ గౌడ్ లు మాట్లాడుతూ, ఆకలితో అలమటించే అనాథలకు, అనాధ ఆశ్రమాలలో ఉండే వారికి భోజనం అందించడం తమ క్లబ్ ఆశయమని తెలిపారు. ఈ కార్యక్రమాలలో అన్ని క్లబ్ ల అధ్యక్ష, కార్యదర్శులు, కోశాధికారులు, డిస్ట్రిక్ట్ చైర్మన్లు, కార్యదర్శులు, గ్యాట్ సభ్యులు పాల్గొన్నారు.












