కామారెడ్డి జిల్లాలోని లేబర్ అడ్డ వద్ద కార్మికులకు సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
జిల్లా సూపరింటెండ్ ఆఫ్ పోలీస్ శ్రీ. ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సబ్-ఇన్స్పెక్టర్ శ్రీ. మహేష్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, OTP లను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ ధరించడం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు.
సైబర్ నేరాలకు సంబంధించి 1930 టోల్ ఫ్రీ నంబర్‌ను, అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు.
పోలీస్ కళాబృందం సభ్యులు రామంచ తిరుపతి, పిసి. సాయిలు పాటలు, మాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్మికులు పాల్గొన్నారు.












