
ఎల్-నినో ప్రభావంతో ఏర్పడే ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం లక్డారం రైతు వేదికలో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.



















