
జహీరాబాద్ పట్టణంలో పెరుగుతున్న జనాభా, పారిశ్రామిక విస్తరణ, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతూ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీ.వీ.ఆనంద్ ను హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.



















