వినియోగదారులకు ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ఐటీడీఏ, ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (పీఓ) యువరాజ్ మర్మాట్ సూచించారు. బుధవారం ఆయన జీసీసీ పెట్రోల్ బంక్‌ను డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తనిఖీలో భాగంగా, పెట్రోల్ బంక్‌లో లావాదేవీలు, రిజిస్టర్లు, త్రాగునీరు, టాయిలెట్లు, గాలి యంత్రం వంటి సదుపాయాలను పీఓ పరిశీలించారు. వినియోగదారులకు కనీస సౌకర్యాలు కల్పించాలని, పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు.
ఇంధనాన్ని అవసరానికి ముందుగానే నిల్వ చేసుకోవాలని, "నో స్టాక్" బోర్డులు పెట్టవద్దని యాజమాన్యాన్ని హెచ్చరించారు. ఇంధన నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బంక్ ఇంచార్జి ప్రదీప్ పాల్గొన్నారు. కార్యకలాపాల నిర్వహణలో పారదర్శకత, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచనలు చేశారు.







