సంగారెడ్డి, జూన్ 27
నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్ శనివారం అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఆయన, వారికి అందుతున్న విద్యా, వసతి, ఆహార సదుపాయాలపై ఆరా తీశారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలను నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ వనముల బుచ్చేష్ యాదవ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న విద్యా, వసతి, ఆహార సదుపాయాలపై ఆరా తీశారు.
అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌ను కలిసి పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందేలా అధికారులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నర్సాపూర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి, పార్టీ నాయకులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.











