నిజామాబాద్, ఆగస్టు 4
మైనర్ బాలలను ప్రలోభపెట్టి, వారి ఇళ్లలోని బంగారు ఆభరణాలను చోరీ చేయించిన కేసులో ఒక వ్యక్తిని 3వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మైనర్ బాలలను ప్రలోభపెట్టి, వారి ఇళ్లలోని బంగారు ఆభరణాలను చోరీ చేయించిన కేసులో ఒక వ్యక్తిని 3వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, 3వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ధనుష్ అనే వ్యక్తి, మైనర్ బాలలను ప్రేరేపించి, వారి ఇళ్లలో ఉన్న బంగారు ఆభరణాలను రహస్యంగా తీసుకొచ్చి తనకు అందజేసేలా ప్రలోభపెట్టాడు. ఈ విషయం బాలల కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో వారు 3వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీఎస్ ఏసీపీ శ్రీశైలం పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా నిందితుడు ధనుష్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా, అతని వద్ద నుంచి సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితుడిని గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
మైనర్ బాలలను నేరాలకు ప్రేరేపించే వ్యక్తులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ హరిబాబు హెచ్చరించారు.










