** (ప్రశ్న ఆయుధం) జూలై 04
వానాకాలం వ్యవసాయ సీజన్‌ను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతు రిజిస్ట్రీ నమోదును వేగవంతం చేయడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్ పామ్, ఉద్యాన పంటలు, సూక్ష్మ సాగునీటి వినియోగంపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, తాగునీటి నాణ్యతపై నిరంతర పర్యవేక్షణతో పాటు గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను ముమ్మరం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలను నాణ్యతతో అమలు చేసి విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్డీఏ పీడీ దామోదర్, జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డి, జడ్పీ సీఈవో చందర్, ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, డీఈవో మల్లిఖార్జున్, జిల్లా ప్రణాళిక అధికారి రఘునందన్ తదితర అధికారులు పాల్గొన్నారు.