సంగారెడ్డి, జూలై 18
పంటలు నష్టపోయిన రైతులకు విత్తనాలు, ఎరువులు ప్రభుత్వమే అందించాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సంగారెడ్డి మండలం కోతలాపూర్ గ్రామంలో రైతులతో కలిసి పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు లేక పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. రైతులు వేసిన పత్తి, వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నష్టపోయాయని తెలిపారు. రైతులు ఎకరాకు 30 నుండి 40 వేల వరకు నష్టం జరిగిందని అన్నారు. కౌలు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని తెలిపారు.
కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా వేసే పంటలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాంరెడ్డి, రైతులు ప్రభాకర్, మహేందర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.