సంగారెడ్డి, జూలై 28
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు సమన్వయంతో సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి, బ్లాక్ స్పాట్లలో తక్షణ నివారణ చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాను ప్రమాద రహితంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పని చేస్తూ సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాలకు కారణమయ్యే అంశాలను శాస్త్రీయంగా విశ్లేషించి, బ్లాక్ స్పాట్లలో తక్షణ నివారణ చర్యలు చేపట్టడం ద్వారా జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
మంగళవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఈ మేరకు చర్చించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు, వాటికి దారితీస్తున్న కారణాలపై అధికారులతో వివరంగా చర్చించారు. ప్రమాదాల నివారణకు ప్రతి శాఖ చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్లాక్ స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో వెంటనే భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించడం, గుంతలు, ఎత్తుపల్లాలను వెంటనే మరమ్మతు చేయడం, అవసరమైన చోట బారికేడ్లు ఏర్పాటు చేయడం, ప్రధాన కూడళ్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో తగిన వెలుతురు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే హాట్ స్పాట్లు, రోడ్డు క్రాసింగ్ల వద్ద రంబుల్ స్ట్రిప్స్, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సైనేజీలు ఏర్పాటు చేసి వాహనాల వేగాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్అండ్ బీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, డీఎస్పీలు, రవాణా శాఖ అధికారులు, ఆర్టీసీ ప్రతినిధులు, నేషనల్ హైవే అథారిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.












