నిజామాబాద్, జూలై 31
నందిపేట్ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు షిఫ్టింగ్ అనుమతి, ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేకుండానే నిర్వహిస్తున్నారని, విద్యార్థుల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారని బీసీ విద్యార్థి సంఘం ఆరోపించింది. పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డీఈఓను కలిసి వినతిపత్రం సమర్పించారు.
నందిపేట్ మండలంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకుని, పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని బీసీ విద్యార్థి సంఘం ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు నవాతే ప్రతాప్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) అశోక్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నవాతే ప్రతాప్ మాట్లాడుతూ.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు షిఫ్టింగ్ అనుమతి (షిఫ్టింగ్ పర్మిషన్), ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీ లేకుండానే పాఠశాలను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అలాగే విద్యార్థులను పాఠశాల బస్సుల్లో సామర్థ్యానికి మించి తరలిస్తూ వారి భద్రతను ప్రమాదంలో పడేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ అంశాలను ఈ నెల 4వ తేదీన విద్యాశాఖ అధికారులు, నందిపేట్ మండల విద్యాధికారి (ఎంఈఓ) దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీస మౌలిక వసతులు లేకుండా, స్వల్ప వర్షానికే పాఠశాల ఆవరణ బురదమయంగా మారుతున్నప్పటికీ యాజమాన్యం అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను నిర్వహిస్తోందని ఆరోపించారు.
అందువల్ల సంబంధిత అధికారులు వెంటనే విచారణ చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం నాయకులు ప్రతాప్, శ్రీను, అరవింద్, నందు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.











