పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ (PSSM) ఆధ్వర్యంలో కామారెడ్డి కేంద్రంలో ఆదివారం ఒక సామూహిక ధ్యాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా పీఎస్ఎస్ఎమ్ అధ్యక్షులు కాముని జ్ఞానేశ్వర్ గారు కలిసి కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు.
ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ధ్యానం మరియు భగవద్గీతపై అవగాహన పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ, “ధ్యానమంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, సత్యజ్ఞాన ప్రసాదిని” అని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నిమ్మ భూమిరెడ్డి, బొల్లు చంద్రశేఖర్, సుదర్శన్, రామకృష్ణ, ప్రేమ్ సాగర్ తదితరులు మరియు భక్త బృందం పాల్గొననున్నారు.












