తెలంగాణ రాష్ట్రానికి మూడవ పూర్తికాల డీజీపీని నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. యూపీఎస్సీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల తుది జాబితాను ఖరారు చేసింది. వీరిలో ఒకరిని హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్‌గా నియమించనున్నారు.
కేంద్ర పౌరజన సేవల మంత్రిత్వ శాఖ పరిధిలోని యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారుల తుది జాబితాను ఖరారు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ జాబితాలో 1991 బ్యాచ్‌కు చెందిన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) స్పెషల్ డైరెక్టర్, మరియు 1994 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ జైళ్ల శాఖ డీజీ సౌమ్యా మిశ్రా పేర్లు ఉన్నట్లు సమాచారం.
ఈ ముగ్గురు అధికారులలో ఒకరిని రాష్ట్ర నూతన పోలీస్ హెడ్ (హెడ్ ఆఫ్ ది పోలీస్ ఫోర్స్) గా నియమించే అవకాశం ఉంది.
ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.











