కామారెడ్డి జిల్లా ప్రజలందరికీ యుగాది (ఉగాది) పర్వదినం సందర్భంగా జిల్లా పాలనాధికారి శ్రీ ఆశిష్ సాంగ్వాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు నూతన సంవత్సరానికి ఆరంభ సూచికగా నిలిచే ఈ పర్వదినం మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విశిష్టమైన వేడుక అని ఆయన పేర్కొన్నారు.
ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో నిండిపోవాలని ఈ శుభ సందర్భంగా జిల్లా పాలనాధికారి ఆకాంక్షించారు. ప్రజలందరూ పరస్పర స్నేహభావంతో, ఐకమత్యంతో జీవిస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు.
కొత్త సంవత్సరంలో జిల్లా మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ యుగాది పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఆశలు, అవకాశాలు, విజయాలను తీసుకురావాలని ఆకాంక్షించారు.
యుగాది పండుగను పురస్కరించుకొని జిల్లా ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. జిల్లా పాలనాధికారి కార్యాలయం నుంచి విడుదలైన పత్రికా ప్రకటనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.












