సంగారెడ్డి, జూలై 15
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా బండారు యాదగిరి రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జర్నలిస్టులు ఆయనను ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-ఐజేయూ) సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన బండారు యాదగిరిని జిల్లా జర్నలిస్టులు ఘనంగా సన్మానించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బండారు యాదగిరి మాట్లాడుతూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండి పోరాడతానని హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, గృహ స్థలాలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు డి.శ్రీకాంత్, దొంతి మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












