హైదరాబాద్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ పోటీలకు దరఖాస్తుల గడువును మార్చి 26 వరకు పొడిగించారు. ఈ పోటీలు మార్చి 28, 29 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించబడతాయి.
వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈ క్రీడలు జరుగుతున్నాయి. ఉమ్మడి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రెటరీ (కామారెడ్డి జిల్లా ఇంచార్జి) చెల్లాపురం శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు.
అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, త్రోబాల్, చెస్, క్యారం, కబడ్డీ, కోకో, తైక్వాండో, స్కేటింగ్, స్విమ్మింగ్, టగ్ ఆఫ్ వార్, 2కే, 3కే రన్, సైక్లింగ్, ఫెన్సింగ్, షూటింగ్, రెజ్లింగ్, పవర్‌లిఫ్టింగ్ వంటి అనేక విభాగాల్లో పోటీలు ఉంటాయి.
విజేతలకు నగదు ప్రోత్సాహకాలు, ప్రశంస పత్రాలు అందజేస్తారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని లేదా నిర్దేశించిన ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా ఇంచార్జిగా ఆకుల భరత్ వ్యవహరిస్తున్నారు.












