పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో ఐలాపూర్ మాణిక్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ – సీజన్ 3 టోర్నమెంట్ యువతను ఆకట్టుకుంటోంది. ఈ పోటీల ఫైనల్ మ్యాచ్ మార్చి 1న జరగనుంది. విజేత జట్టుకు రూ. 1,00,000/- నగదు బహుమతిగా అందించబడుతుంది.
ఐలాపూర్ మాణిక్ యాదవ్ నేతృత్వంలో బీరంగూడ, అమీన్పూర్ డివిజన్లలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నమెంట్‌కు యువత నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించడం, యువతలో ఐక్యతను పెంపొందించడం ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశ్యాలుగా పేర్కొన్నారు.
మార్చి 1న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌ను విజయవంతం చేయడానికి ప్రజలు, క్రీడాభిమానులు, యువత పెద్ద ఎత్తున హాజరుకావాలని ఐలాపూర్ మాణిక్ యాదవ్ పిలుపునిచ్చారు.


