సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 11వ తేదీన జరిగే ఎన్నికల కోసం 11 వందల మంది సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాట్లు చేపట్టారు.
జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు, ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట భద్రత చర్యలు చేపట్టడం జరుగుతుందని. ఓటర్లు స్వేచ్ఛయుత ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
అదనపు ఎస్పీ మరియు డీస్పీల ఆధ్వర్యంలో ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు అప్రమత్తంగా పని చేస్తాయని ఆయన తెలిపారు. 8 మున్సిపాలిటీలలో 199 వార్డులకు 153 కేంద్రాలు, 453 పోలింగ్ స్టేషన్స్ లో ఎన్నికలు జరుగనున్నాయి.
సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ గా 59 కేంద్రాలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ రోజు ప్రత్యేక ఎలక్షన్ సెల్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం జరుగుతుందని చెప్పారు.
ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే మద్యం అక్రమ రావాణాపై 30 కేసుల్లో రూ.1.57 లక్షల విలువైన 249 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.


