ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన శస్త్రచికిత్స నుండి త్వరగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్, గోపాల్ నగర్, కూకట్ పల్లి ఆధ్వర్యంలో గోకుల్ ఫ్లాట్స్ లోని అభయ వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆకు పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, పవన్ కళ్యాణ్ గోత్రం పేరున పూజలు నిర్వహించి, 108 టెంకాయలు కొట్టి ఆయన త్వరగా కోలుకోవాలని మొక్కుకున్నారు.
ఈ పూజల్లో గోపాల్ నగర్ పవన్ కళ్యాణ్ యూత్ ఫోర్స్ సభ్యులు, జనసేన నాయకులు, కాలనీ వాసులు, అభిమానులు పాల్గొన్నారు. అందరూ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆయన త్వరగా కోలుకుని తిరిగి ప్రజా సేవలో పాల్గొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు.











