కామారెడ్డి, జూలై 15
కామారెడ్డి మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అంజవ్వ ఆదివారం ద్విచక్రవాహనం నుంచి జారిపడటంతో కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఆమెను చికిత్స కోసం కామారెడ్డిలోని శ్రీ మెడికల్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ విషయం తెలుసుకున్న ఉప్ప సర్పంచి సంధ బాలయ్య ఆస్పత్రికి వెళ్లి అంజవ్వను పరామర్శించారు.
కామారెడ్డి మండలంలోని పోతాయిపల్లి గ్రామానికి చెందిన వేల్పుల అంజవ్వ ఆదివారం ద్విచక్రవాహనం నుంచి జారి పడడంతో కాలుకు ఫ్రాక్చర్ అయింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని శ్రీ మెడికల్ హాస్పిటల్లో చేర్పించారు.
ఈ విషయం తెలుసుకున్న పోతాయిపల్లి ఉప్ప సర్పంచి సంధ బాలయ్య ఆస్పత్రికి వెళ్లి అంజవ్వను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అంజవ్వ కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉంటామని సర్పంచి సంధ బాలయ్య హామీ ఇచ్చారు.











