జగిత్యాల పట్టణంలో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి నివాసంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లతో కలిసి ఒక కీలక సమావేశంలో పాల్గొన్నారు.
జీవన్ రెడ్డి, తన నివాసానికి విచ్చేసిన ముఖ్య నాయకులకు ఘనస్వాగతం పలికారు. పార్టీ అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికల వ్యూహాలపై చర్చ జరిగినట్లు సమాచారం. నాయకులు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నాయకులు చర్చించుకున్నారని, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కూడా పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఈ భేటీ ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు, నాయకుల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.











