సంగారెడ్డి, జూలై 5
ద్వారాలో యాప్ ఎరువుల పంపిణీలో పారదర్శకత, అవసరానికి తగినట్లుగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా యాప్ ను ప్రవేశపెట్టింది. యాప్ు ఈ యాప్ ద్వారా తమకు కావాల్సిన యాప్ను ముందుగానే బుక్ చేసుకోవాలని ద్వారా చేసుకోవాలి: బుకింగ్ చేసుకోవాలి:జిల్లావ్యవసాయఅధికారిశివప్రసాద్ సూచించారు.
జిల్లాలో రైతులకు యూరియా ఎరువులు పారదర్శకంగా, అవసరానికి అనుగుణంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు.
రైతులు తమ సమీప ఎరువుల విక్రయ కేంద్రంలో యూరియా లభ్యతను నిర్ధారించుకుని, యాప్ ద్వారా ముందుగానే బుకింగ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
రైతులు పంట విస్తీర్ణాన్ని బట్టి శాస్త్రీయ పద్ధతిలో యూరియాను వినియోగించడం ద్వారా ఎరువుల సామర్థ్యం పెరగడంతో పాటు పంట దిగుబడులు కూడా మెరుగుపడతాయని తెలిపారు. వ్యవసాయ శాఖ సూచించిన విధంగా యూరియాను దశలవారీగా వినియోగించాలని రైతులకు సూచించారు.
అలాగే, ఒకసారి యూరియా బుక్ చేసిన తర్వాత 20 రోజుల వ్యవధి పూర్తయిన అనంతరం తదుపరి బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని యూరియా బుకింగ్ యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూరియాను పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ తెలిపారు.












