సంగారెడ్డి, జూలై 14
సంగారెడ్డి జిల్లాకు చెందిన కుంగ్ ఫూ గ్రాండ్ మాస్టర్ పోచయ్య, అతని 1,212 మంది శిష్యుల బృందం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన సందర్భంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం వారిని సన్మానించారు. కేవలం అరగంటలోనే 72 సార్లు కరాటే కటా ప్రదర్శించి ఈ ఘనత సాధించారు.
కుంగ్ ఫూ కరాటే కటాలో అద్భుతమైన ప్రదర్శన చూపినందుకు సంగారెడ్డి జిల్లాకు చెందిన కుంగ్ ఫు గ్రాండ్ మాస్టర్ పోచయ్య ను సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మంగళవారం సన్మానించారు. పోచయ్య కేవలం అరగంటలోనే 72 సార్లు కటా ప్రదర్శించినందుకు 1,212 మంది బృందానికి గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.
ఏప్రిల్ 26న గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈ ప్రదర్శన జరిగింది. మూడు రోజుల క్రితం అధికారికంగా రికార్డును ధృవీకరిస్తూ సర్టిఫికెట్లను లండన్ నుంచి పంపించారు. ఈ ప్రదర్శనలో సంగారెడ్డి జిల్లాకు చెందిన కుంగ్ ఫు మాస్టర్ పోచయ్య తో పాటు అతని శిష్య బృంద సభ్యులు పాల్గొన్నారు.
కుంగ్ ఫూ క్రీడకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలిసారిగా పోచయ్య బృందం ఈ అరుదైన ఘనతను సాధించింది. గతంలో ఉన్న ప్రపంచ రికార్డును వీరు బద్దలు కొట్టారు. గతంలో గంటలో 600 మంది కలిసి 30 సార్లు కటా ప్రదర్శించారు. ప్రస్తుతం బృందం కేవలం అరగంటలోనే 72 సార్లు కటా ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు.
ఈ సందర్భంగా మంగళవారం సంగారెడ్డిలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని పోచయ్య కలిశారు. తాము నెలకొల్పిన రికార్డు గురించి ఆయనకు వివరించారు.












