జిల్లా వ్యాప్తంగా పోలీసుల విజిబుల్ పోలీసింగ్ కార్యకలాపాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం వంటి అంశాలపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు.
రాత్రివేళల్లో నగరం మరియు శివారు ప్రాంతాలలో పెట్రోలింగ్ విస్తృతంగా నిర్వహిస్తున్నారు. దీని ద్వారా అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలు ఏవైనా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.
ప్రజల భద్రత మరియు శాంతిభద్రతల పరిరక్షణ పోలీసుల ప్రథమ కర్తవ్యమని, ఇందుకోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఏదైనా అనుమానాస్పద సమాచారం లేదా సంఘటనల గురించి తెలియజేయడానికి, 112 లేదా ఈగల్ సెల్ నంబర్ 1972ను సంప్రదించవచ్చు.











