సెకండ్ ఎడిషన్ సీఎం కప్–2025 క్రీడల్లో అండర్-17 షటిల్ బ్యాడ్మింటన్‌లో సిల్వర్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ కె. కిరణ్ కుమార్ కుమారుడు కే. తరుణ్ రాజ్‌ను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు.
జిల్లా స్పెషల్ బ్రాంచ్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కిరణ్ కుమార్ కుమారుడు తరుణ్ రాజ్, గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 22, 23 తేదీల్లో జరిగిన ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్ వరకు చేరి రన్నరప్‌గా నిలిచి ప్రశంస పత్రం అందుకున్నారు.
పోలీస్ కమిషనర్ కార్యాలయంలో తరుణ్ రాజ్‌ను శాలువాతో సత్కరించిన కమిషనర్ పి. సాయి చైతన్య, పోలీస్ సిబ్బంది పిల్లలు క్రీడల్లో రాణించడం ఆనందకరమని, తరుణ్ విజయం జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో సాధించిన ఈ విజయం ఇతర యువతకు ఆదర్శమని అన్నారు.
తరుణ్ రాజ్ విజయంతో కుటుంబంతో పాటు పోలీస్ శాఖకు గౌరవం తీసుకువచ్చారని కమిషనర్ కొనియాడారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు క్రీడల్లో పూర్తి సహకారం అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. యువత క్రీడలపై ఆసక్తి చూపాలని సూచించారు.








