కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ జర్నలిస్టు, సామాజిక సేవకుడు డాక్టర్ చేట్టబోయిన స్వామి ముదిరాజ్‌కు జర్నలిజం రంగంలో విశిష్ట సేవలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చేసిన కృషికి గుర్తింపుగా గౌరవ డాక్టరేట్ లభించింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంలో ఆయన ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.
మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో ఫరీదాబాద్‌లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో డాక్టర్ ముదిరాజ్‌కు జాతీయ పురస్కారంతో పాటు గౌరవ డాక్టరేట్‌ను ప్రముఖుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, సామాజిక సేవకులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
డాక్టర్ ముదిరాజ్ జర్నలిజం రంగంలో ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, సామాజిక చైతన్య కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన సొంత పత్రికను నిర్వహిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.
బీసీ సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ, యువత అభివృద్ధి, సామాజిక సంక్షేమం, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు, పేదలకు సహాయ సహకారాలు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలను ఆయన చేపడుతున్నారు. సమాజానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తించి నిర్వాహకులు ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.











