సంగారెడ్డి, జూలై 7
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు ప్రజలకు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జిల్లా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. జిల్లాలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు కల్పించాలని అన్నారు.
ఆసుపత్రుల్లో తాగునీటి సౌకర్యం, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, విద్యుత్ వైరింగ్, లైటింగ్, ఫ్యాన్లు, ఇతర చిన్నచిన్న మరమ్మత్తులు చేపట్టేందుకు అవసరమైన అంచనా ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పీహెచ్‌సీని అన్ని విధాలుగా బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, లక్ష్య సాధనలో వెనుకబడిన ప్రాంతాల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టి, ప్రజల్లో అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందేలా కృషి చేసి వంద శాతం లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డెంగ్యూ, చికున్‌గున్యా, టైఫాయిడ్ తదితర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, డిప్యూటీ డీఎంహెచ్వోలు, డాక్టర్ శశాంక్, పీహెచ్సీ, యూపీహెచ్సీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.












