సంగారెడ్డి, జూలై 2
జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జాతీయ సన్మానం ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలుసంగారెడ్డిఆదర్శఆధ్వర్యంలోదినోత్సవంకార్యక్రమాలు సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో వైద్యులను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డిలోని శ్రీ బాలాజీ, శ్రీ గోకుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో విశేష సేవలు అందిస్తున్న 25 మంది జాతీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా వివిధ దినోత్సవం కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
భారతీయ సంస్కృతి 'వైద్యో నారాయణో హరి' అని బోధిస్తుందని, వైద్యులు దైవ స్వరూపమని, ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణంలో వైద్యుల సేవలు అమూల్యమైనవని శేరిలింగంపల్లి రీజియన్ చైర్మన్ లయన్ గుమ్మడిదల వెంకన్న అన్నారు. లయన్స్ డిస్ట్రిక్ట్ 320-డి పిలుపు మేరకు, లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు లయన్ శంకరి విజయేందర్ రెడ్డి అధ్యక్షతన జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సంగారెడ్డిలోని శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లయన్ డా.కోనేటి శ్రీధర్ సౌజన్యంతో, శ్రీ గోకుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లయన్ డా. గడ్డమీది శ్రీహరి సౌజన్యంతో విశేష వైద్య సేవలు అందిస్తున్న 25 మంది వైద్యులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు. సమాజంలో వైద్యులు ప్రత్యక్ష దైవాలని, వారి సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని గుమ్మడిదల వెంకన్న కొనియాడారు.
అంతకు ముందు లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ ఆధ్వర్యంలో సంగారెడ్డి పరిధిలోని ఆసుపత్రులు, పాఠశాలలు, శ్రామిక ప్రాంతాల్లో మొత్తం 10 సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎనిమిది సేవా కార్యక్రమాలు, అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా మరో రెండు కార్యక్రమాలు చేపట్టారు.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 150 మంది నిరుపేదలకు అన్నదానం. కొత్తలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, విద్యా సామగ్రి, వాటర్ డిస్పెన్సర్లు పంపిణీ. కొత్తలాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి, వాటర్ డిస్పెన్సర్ల అందజేత. కొత్తలాపూర్ ఎస్సీ కాలనీలోని చిన్నారులకు నోటుబుక్స్, వాటర్ డిస్పెన్సర్ల పంపిణీ. శ్రీ వెంకటేశ్వర సిమెంట్ వర్క్స్‌లోని కార్మికులకు 100 దుప్పట్లు పంపిణీ. ఫసల్ వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలోని గోవులకు పశుగ్రాసం అందజేత. పోతిరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీతో పాటు మొక్కల నాటడం. అనంతరెడ్డి కాలనీలో మొక్కలు నాటడం. శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్స్ డే వేడుకలు. శ్రీ గోకుల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో 25 మంది వైద్యుల సన్మానం.
ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి, డిస్ట్రిక్ట్ 320-డి చైర్మన్ పి. రాములు గౌడ్, అనంతరావు కులకర్ణి, జోన్ చైర్మన్ ఎల్. మల్లేశం, రీజియన్ కార్యదర్శి ఎం. వెంకటేశం, లయన్స్ సభ్యులు పి.రామకృష్ణారెడ్డి, పి.రంగోపాల్, జి.మాణిక్‌రావు, జి.శ్రీధర్‌రెడ్డి, ఎస్.ప్రకాశ్, బి.శ్రీనివాస్, ఎస్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.











