
రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో, జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సమ్మెను శాంతియుతంగా నిర్వహించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన కార్మికులకు సూచించారు.


















