
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. ఆర్మూర్‌లో సమ్మె చేస్తున్న కార్మికులకు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. సమ్మెలో ఉన్న డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.



















