
అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పూజలు నిర్వహించి ఈ ఆధ్యాత్మిక వేడుకను ప్రారంభించారు.

అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ఇస్కాన్) ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పూజలు నిర్వహించి ఈ ఆధ్యాత్మిక వేడుకను ప్రారంభించారు.

మార్షల్ ఆర్ట్స్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పిన బాల ప్రతిభామూర్తి మాల్వే విహాన్‌ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. చిన్నారి తల్లిదండ్రులు రామేశ్వర్, అశ్విన్‌లతో కలిసి ఎమ్మెల్యేను కలిసిన విహాన్‌ను ఆయన అభినందించారు. జిల్లాకు, రాష్ట్రానికి గర్వకారణమని ఎమ్మెల్యే కొనియాడారు.

ఎల-నినోలలయసయ,తగునీు,శుసధకగలతికూలిసథితులుతలెతతకుడముదసతుకయచణతోసిదధగఉడలనిషటగనులు,ూగనులశఖమతిిేకెకటసమిఅధికులనుఆదేశిచు.దీనిఆయనసోమసగెడడిలోసమీకషసమేశనిహిచు.

ఎల్-నినో ప్రభావం వల్ల వ్యవసాయం, తాగునీరు, పశుసంవర్ధక రంగాలపై ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డికి మద్దతుగా అంకాపూర్‌కు వెళ్లేందుకు ప్రయత్నించిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాను సోమవారం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో విఫలమైందని, ప్రజా సమస్యలను పక్కన పెట్టి అనవసర అంశాలతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సోమవారం నిజామాబాద్‌లోని శ్రద్ధానంద్ గంజ్ ఉమామహేశ్వర ఆలయంలో ప్రత్యేక అభిషేకం, పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన పరమేశ్వరుడిని ప్రార్థించారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపించారు. కళ్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం, మహిళలకు స్కూటీలు వంటి వాగ్దానాలను విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వట్ పల్లి మండల కేంద్రంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ చిత్రపటానికి నాయకులు పాలాభిషేకం చేశారు. రూ.300 కోట్ల నిధులతో అల్లాదుర్గ్–మెటల్‌కుంట, జోగిపేట–వట్ పల్లి, భూత్కూర్–వట్ పల్లి రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడాన్ని వారు అభినందించారు.

మైనర్ల చేత వాహనాలు నడిపించడాన్ని అరికట్టేందుకు రవాణాశాఖ కఠిన చర్యలు చేపట్టింది. మోటారు వాహనాల చట్టం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మైనర్లు నడిపిన వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తోంది. ఈ చర్యల్లో హైదరాబాద్ తర్వాత అత్యధికంగా నిజామాబాద్ జిల్లా రెండో స్థానంలో నిలవడం గమనార్హం. 2025 జూన్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో 283 వాహనాల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో శాలివాహన బోనాల మహోత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

సంగారెడ్డి పట్టణంలో ఆషాడ మాసం సందర్భంగా బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలకు డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయబద్ధంగా కుమ్మర్లు తొలి బోనాన్ని ఎల్లమ్మ తల్లికి సమర్పించారు.

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, వైశ్య సమాజం ఐక్యతతో ముందుకు సాగుతూ సామాజిక, రాజకీయ రంగాల్లో మరింతగా ఎదగాలని పిలుపునిచ్చారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని ఉత్తర తిరుమలలో నిర్వహించిన వనభోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి నివాసాన్ని కాంగ్రెస్ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేస్తే, తాము కూడా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి హెచ్చరించారు. నిజామాబాద్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మహత్తర పండుగ బోనాలు అని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని కోటగల్లిలో ఉన్న కట్ట మైసమ్మ ఆలయం, నాందేవ్‌వాడ గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఉత్సవాల్లో పాల్గొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 1 నుంచి 31 వరకు నెల రోజులపాటు రేషన్ బియ్యం పంపిణీ జరగనుంది.

సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ అయిన కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించే వరకు తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమాన్ని కొనసాగిస్తామని సంస్థ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. మెడికల్ బోర్డు నిర్వహణలో ప్రభుత్వం మొక్కుబడి వైఖరి అవలంబిస్తోందని ఆమె విమర్శించారు.

నగరంలో నిర్వహించిన వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో భాగంగా పోలీసులు ఒక చోరీ బైక్‌ను, బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా, మరొకరు పరారయ్యారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా ఈశాన్య జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్‌లోనూ సాయంత్రం నుంచి జల్లులు పడతాయని అంచనా వేశారు.

నిర్మల్ జిల్లా బాసరలో ఆషాఢ మాస బోనాల సందర్భంగా బాసర ఆటో యూనియన్ డ్రైవర్లు మహంకాళి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ సుఖశాంతులు, వృత్తి అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

నగరంలోని 6వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అసద్‌బాబా నగర్ రాజీవ్ గృహకల్ప అపార్ట్మెంట్లలో ఆదివారం ఏసీపీ ఆధ్వర్యంలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని ఒక కారు, ఐదు ఆటోరిక్షాలు, 35 మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.