
మణుగూరులోని తోగుడెం ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి కత్తితో దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటనతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.



















