కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ రోడ్ వద్ద నూతనంగా 'శుభమ్ గ్రాండ్ బ్యాంకెట్ హాల్' మరియు 'శుభమ్ గ్రాండ్ టేక్ ఏ వే అండ్ కేటరింగ్' ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నూతనంగా ప్రారంభమైన ఈ వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవానికి బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జనసేన పార్టీ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్, అఖిల భారత చిరంజీవి యువత రవణం స్వామి నాయుడు విచ్చేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా విందు, వినోద, వేడుకల కోసం ఒకేచోట సకల సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో ఈ వ్యాపారాలను ప్రారంభించడం ప్రశంసనీయమన్నారు. యువతరం నూతన ఆవిష్కరణలతో ముందుకు రావడం స్థానిక ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ సంస్థలు ప్రజలకు నాణ్యమైన సేవలను అందిస్తూ మరింత వృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వేముల మహేష్, పోలెబోయిన శ్రీనివాస్, పోలెబోయిన గోపి కృష్ణతో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.











