రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతినడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగానికి అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వడ్లు కొట్టుకుపోతున్నాయని, రైతులు కన్నీరుమున్నీరవుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం, అసమర్థత వల్లే రైతులు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తక్షణమే నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.











