శ్రీ కల్కి ఆలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవంలో 500 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో శ్రీ కల్కి భగవతి భగవానుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
కళ్యాణ కార్యక్రమం అనంతరం 500 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు అమ్మ భగవానుల ఆశీర్వాదాన్ని పొందారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ఆశీర్వచనాన్ని అందజేయడం జరిగింది. ఆలయ సేవకులు మరియు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












