సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో మాతా రమాబాయి అంబేద్కర్ వర్ధంతిని సామాజిక కార్యకర్త డాక్టర్ వేల్పుల శంకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జీవితంలో ఆమె పాత్ర ఎంతో కీలకమని పలువురు కొనియాడారు.
డాక్టర్ వేల్పుల శంకర్ మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విజయానికి మాతా రమాబాయి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆయన చదువుల కోసం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుమారుని ఆరోగ్యం బాగాలేని సమయంలోనూ, ఆయన చదువు కొనసాగేలా డబ్బులు పంపించి ప్రోత్సహించిన గొప్ప త్యాగశీలి అని తెలిపారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేపట్టిన ఉద్యమాలలో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా సహకరించిన గొప్ప మహిళ అని ఆయన కొనియాడారు. ఆమె త్యాగం, సహకారం అంబేద్కర్ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
ఈ వర్ధంతి కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పిడిశెట్టి రాజు, ప్రజా రాజ్యాధికార పార్టీ నాయకులు మంతిని శ్రీకాంత్, తోట చంద్రయ్య, సార్ రజిత, బాబు, పోచమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాతా రమాబాయి అంబేద్కర్‌కు ఘనంగా నివాళులర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు మాతా రమాబాయి అంబేద్కర్ చేసిన త్యాగాలను, అంకితభావాన్ని స్మరించుకున్నారు. ఆమె స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.











